Bommasani mahesh
Disciple of Prayer
అయ్యా, మా అమ్మ పేరు మరియమ్మ, మా అమ్మ కు గుండె లో హోల్ మూసుకొని పోయాయి. గుండె ఒక వైపు ఉబ్బినట్లు ఉంది. చెడు రక్తము గుండె పక్కనుండి సైడ్ కు వెళ్ళతున్నది. దీని వలన ఆయాసం, దగ్గు వస్తున్నాయి. ఆపరేషన్ చేస్తే 50/50 ఛాన్సెస్ అంటున్నారు. చాలా భయంగా, బాధగా, ఉంది సారు. ఇన్నీ సమస్యలు ఉన్నందున ఆపరేషన్ కాస్తా ఆలస్యం చేశాము. దీని వలన కూడా గుండె కు సంబంధించిన చెడు రక్తం అమ్మ చేతిలో కి వచ్చి ఆగిపోయింది. చేతిలోకీ రావటం వల్ల అమ్మ చేయి లావుగా అయిపోయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది. ఇలా సమస్యలు వస్తున్నాయి. అమ్మకు ఆపరేషన్ విజయవంతం కావాలనీ, అమ్మకు దేవుడు మంచి స్వస్థత, బలము, చేకూర్చాలని ప్రార్థన చేయండి. దేవుడు ఆమె వెంబడి ఉండి, మాతోపాటు ఆపరేషన్ చేసుకునేందుకు వచ్చిన రోగులకు కూడా స్వస్థత చేకూర్చాలని, మాలాంటి పరిస్థితులు ఎవరికి రకుండగా, మరియు ఈ హోస్పెటల్ కాక భారత్ దేశంలో ఉండే ప్రతి హోస్పెటలను, ప్రపంచంలో ఉండే హోస్పెటల్లను యేసు క్రీస్తు దేవుని ఆధీనంలో ఉండేటట్లు ప్రార్థన చేయండి. స్వస్థత యేసు క్రీస్తు ద్వారా కలిగిందని ప్రపంచంలో తెలియాలని అందుకు మనము ఆయన సేవలో పాలుపంచుకోవాలని ప్రార్థన చేయండి.
